యంగ్ హీరో నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి అనే విషయాన్ని స్పష్టం చేసి గోవాలో ఓ ఐలాండ్ లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన నిఖిల్ కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు.
ఇక ప్రస్తుతానికి సినిమాలు పక్కన పెట్టి ఈ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే గార్ల్ ఫ్రెండ్ పల్లవి వర్మతో ఐదేళ్ళుగా ప్రేమకథకి ఎట్టకేలకి శుభం కార్డు వేసేసి జంట కావడానికి రెడీ అయిన వీరి నిశ్చితార్ధం ఫోటోలని నిఖిల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
తమ చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ ఇద్దరు ఫోటోలకి ఫోజులిచ్చారు.ఏప్రిల్ 16న వీరి వివాహం జరగనుంది.ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ పెళ్లి తర్వాతనే నిఖిల్ తన నెక్స్ట్ సినిమా అయిన కార్తికేయ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.