పెళ్లి వీడియో టీజర్ వదిలిన హీరో నిఖిల్

కొత్త ఏడాదిలో యువ హీరోలైన నిఖిల్, నితిన్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వీరికి కరోనా పెద్ద ఆటంకం సృష్టించింది.

ఈ నేపధ్యంలో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.అయితే నిఖిల్ సెంటిమెంట్ ప్రకారం అనుకున్న ముహూర్తానికి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుకని ముగించేసాడు.

పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా జరిగిపోయిన ఈ పెళ్లి వేడుకకి సంబందించిన మెమోరీస్ ని టీజర్ గా తన అభిమానులు, తెలుగు సినిమా అభిమానుల కోసం సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.వెడ్డింగ్ మూమెంట్స్ మొత్తం సినిమా టీజర్ స్టైల్ లో రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

ఈ వీడియోలో నిఖిల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు నెటిజన్ల ఆకట్టుకున్నాయి.కొత్తజీవితంలోకి అది కూడా తాను కోరుకున్న అమ్మాయితో అడుగుపెడుతున్న ఆనందం నిఖిల్ కళ్ళల్లో కనిపించింది.

Advertisement

ఇక ఈ వీడియో షేర్ చేసి నా వివాహానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలని భావించాను.ప్రస్తుత కొవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఈ వీడియోను మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను.

మీ ఆశీస్సులు నాకు కావాలి.నాకు ఎంతో ఇష్టమైన పాట ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది అని నిఖిల్ వ్యాఖ్యానించాడు.

ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు