మెగా డాటర్ నిహారిక పెళ్లి సందడి ముగిసింది.రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలు ముగించుకుని కుటుంబ సభ్యులు అంతా కూడా హైదరాబాద్ వచ్చేశారు.
ఈ సమయంలోనే ప్రముఖ మీడియా సంస్థల్లో ఈనెల 11 వ తారీకు అంటే నేడు మెగా రిసెప్షన్ ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగింది.కాని మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నేడు ఎలాంటి వేడుకలు కాని ఉత్సవాలు కాని రిసెప్షన్ కాని లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా రిసెప్షన్ లేదని మాత్రం వారు చెప్పడం లేదు.వచ్చే వారంలో ఏ రోజు అయినా కూడా రిసెప్షన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
మెగా అభిమానులు.మీడియా మరియు సినీ ప్రముఖుల కోసం మెగా ఫ్యామిలీ ఈ రిసెప్షన్ ను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ వేడుకను అంతా కూడా భారీగా నిర్వహించారు.పవన్ కళ్యాణ్ నుండి మొదలుకుని మొత్తం మెగా హీరోలు పెళ్లికి హాజరు అయ్యారు.హైదరాబాద్ లో రిసెప్షన్ జరిగితే మళ్లీ మెగా హీరోలు అందరిని కూడా ఒక్క చోట చూసే అవకాశం ఉంటుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా రిసెప్షన్ వార్తలు పుకార్లే అంటూ తేలిపోవడంతో మెగా ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.
మెగా ప్యామిలీ నుండి రాబోతున్న ప్రకటన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.ప్రముఖ హీరోలు హీరోయిన్స్ ఎవరు కూడా నిహారిక పెళ్లికి హాజరు కాలేదు.
కనుక ఈ రిసెప్షన్ వేడుకలో తారా తోరణం కనిపిస్తుందని కూడా అభిమానులు ఆశ పడ్డారు.వారి ఆశలు అన్ని కూడా నిరాశలే అయ్యాయి.
నిహారిక పెళ్లి తంతు ఇంకా పూర్తి కాలేదు.పూజా కార్యక్రమాలు ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
కనుక వాటిని పూర్తి చేసిన తర్వాత అభిమానుల ముందుకు వస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.