మెగా డాటర్ నిహారిక పెళ్లికి సిద్దం అయ్యింది.జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి ఖరారు అయ్యింది.
అధికారికంగా కూడా ప్రకటన వచ్చేసింది.వివాహ నిశ్చితార్థం ఆగస్టులో పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిపేందుకు పెద్దలు నిర్ణయించారు.
ఇదే సమయంలో నిహారిక సినీ కెరీర్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెగా ఫ్యామిలీలో నాగబాబుకు మినహా నిహారిక సినిమాల్లో నటించడం ఎవరికి ఇష్టం లేదు.
ఇక పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటించనుందా లేదా అనేది చైతన్య నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది.
ఇప్పటికే ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు.
ఇద్దరు కూడా మాట్లాడుకుని ఉంటారు.ఒక వేళ సినిమా కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంటే కథలు వినడం చేసేది.
కాని నిహారిక గత కొన్నాళ్లుగా కథలు వినడం మానేసింది.సినిమాలపై ఆసక్తి లేనట్లుగా వ్యవహరిస్తుంది.
ఇప్పటికే కమిట్ అయిన తమిళ సినిమా పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటించే అవకాశం లేదని అంటున్నారు.

సినిమాల్లో నటించకున్నా కూడా వెబ్ సిరీస్‌ల్లో నిహారిక నటించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.నటనపై నిహారికకు చాలా ఆసక్తి.అందుకే ఆమెను కనీసం వెబ్ సిరీస్‌లో అయినా ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.
ఇక చైతన్య హీరోగా పరిచయం అయ్యే అవకాశం ఉందంటున్నారు.నిహారిక ను వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో చైతన్య ఓవర్ నైట్‌లో సెలబ్రెటీ అయ్యాడు.
ప్రస్తుతం ఆయన హీరోగా అవ్వాల్సిందే అంటూ కొందరు మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.మరి చైతన్య నిర్ణయం ఏంటీ? నిహారిక కెరీర్ ఏంటీ అనేది కాలమే నిర్ణయించాలి.