మా అమ్మ సూపర్ విమెన్ అంటున్న నిహారిక

మెగా డాటర్ అనే బ్రాండ్ తో టాలీవుడ్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొనెదల హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇప్పటికి హీరోయిన్ గా నాలుగు సినిమాలు చేసినా ఏ ఒక్కటి వర్క్ అవుట్ అవ్వలేదు.

అయితే నటిగా మాత్రం ఈ బ్యూటీ మంచి మార్కులు వేయించుకుంది.గత ఏడాది డిసెంబర్ లో ఈమె చైతన్యని పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.

పెళ్లి తర్వాత కూడా నటిగా తన ప్రయాణం కొనసాగిస్తున్నట్లు చెబుతూ ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది.కామెడీ ఎంటర్టైనర్ గా ఆ వెబ్ సిరీస్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

సినిమాలలో కూడా హీరోయిన్ గా చేయడానికి రెడీగానే ఉన్న ఈ సారి పక్క హిట్ స్క్రిప్ట్ తోనే రావాలని అనుకుంటుంది.

Advertisement

మరో వైపు నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అవుతుంది.ఇలా మల్టీటాస్క్ లతో నిహారికా తనకంటూ సొంత ఇమేజ్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉంది.ఇదిలా ఉంటే తాజాగా మదర్స్ డే సందర్భంగా నిహారిక తన తల్లిని సూపర్ విమెన్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేసింది.

తన పెళ్లి సమయంలో జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా రివీల్ చేసింది.పెళ్లి టైమ్ లో తన తల్లి విపరీతమైన జ్వరంతో బాధపడుతూ ఉందని, అయితే ఆ బాధని ఎక్కడా కూడా మొహంలో చూపించకుండా అందరిని నవ్వుతూ పలకరించడంతో పాటు, అన్ని పనులు దగ్గరుండి చూసుకుందని చెప్పుకొచ్చింది.

పెళ్లి సమయంలో అమ్మ కాస్తా ఆందోళనకి కూడా గురైందని, అయినా కూడా సూపర్ విమెన్ లా నవ్వుతూనే ఈవెంట్ మొత్తాన్ని నడిపించింది.నీ దగ్గర నుంచి నేను అదే నేర్చుకుంటున్నాను అంటూ నిహారిక తన తల్లికి మదర్స్ డే విషెస్ చెప్పింది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు