పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ నుండి రిలీజ్ అయిన టీజర్ గ్లింప్స్‌తో యావత్ పవన్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఊగిపోతున్నారు.అంతలా ఈ టీజర్ పవర్‌ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో, పవన్ నటించే మరో సినిమా గురించి జనం మరిచిపోయారని చెప్పాలి.
భీమ్లా నాయక్ చిత్రం కంటే ముందే పవన్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ కూడా రివీల్ చేశారు.
ఇక ఈ సినిమాను పవన్‌కు ఆప్తుడైన నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే మరింత ఆలస్యం అవుతుండటంతో పవన్ భీమ్లా నాయక్ చిత్రాన్ని ముందుగా పూర్తి చేసేందుకు పూనుకున్నాడు.
అయితే తాజాగా హరిహర వీరమల్లు చిత్రం నుండి సడెన్ సర్‌ప్రైజ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో అందాల భామ, ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ఆమె ‘పంచమి’ అనే పాత్రలో నిటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
అయితే ఆమె నాట్యం చేస్తూ కనిపించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఆమె పాత్ర ఏమిటా అనే విషయంపై ఇప్పుడే ఓ క్లారిటీకి రాలేమని ప్రేక్షకులు అంటున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలో నిధి అగ్వాల్ లుక్‌ను మీరూ ఓసారి లుక్కేయండి.
మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాలంటే ఈ సినిమా యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.