న్యూజిలాండ్‌ పోలీసుల దీపావళీ వేడుకలు: బాలీవుడ్ పాటలకు స్టెప్పులు

ప్రపంచీకరణ లాభనష్టాలను పక్కనపెడితే, దాని వలన ప్రపంచం ఒక గ్లోబల్‌ విలేజ్‌గా మారిపోయింది.దీంతో విద్య, ఉపాధి అవసరాల నిమిత్తం మనిషి ఖండాలను అవలీలగా దాటేస్తున్నాడు.

దీని వల్ల ఒక ప్రాంత సంస్కృతి మరో ప్రాంతానికి పరిచయమవుతోంది.మనదేశాన్నే తీసుకుంటే.

వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడి స్థానికులకు సైతం మన సాంప్రదాయాలు, కట్టుబాట్లను అలవాటు చేస్తున్నారు.అందుకే భారత్‌లో మాత్రమే నిర్వహించే సంక్రాంతి, దసరా, దీపావళి, బతుకమ్మ, ఓనం వంటి పండుగలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి.

తాజాగా వెలుగు దివ్వెల పండుగ దీపావళిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆనందోత్సాహల మధ్య జరుపుకున్నారు.వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజాగా దివాలీ వేడుకలకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.

న్యూజిలాండ్ పోలీసులు దీపావళి వేడుకల్లో భాగంగా బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు.పండుగ సందర్భంగా ‘ మల్టీ కల్చరల్ కౌన్సిల్ ఆఫ్ వెల్లింగ్టన్’ సంస్థ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.అందులో భాగంగా హిందీలో సూపర్ హిట్టయిన ‘కర్ గయీ చుల్’,కలా చాష్మా’ పాటలకు పోలీసు అధికారులు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

దీనిని న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పంచుకుంది.ఈ వీడియోలో పోలీసు అధికారుల బృందం ఉత్సాహంగా పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.చిరునవ్వులు చిందిస్తూ, ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ చేసిన ఈ గ్రూప్‌ డ్యాన్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

న్యూజిలాండ్‌లో దీపావళి పండుగ క్రేజ్ ఎలా వుందో తెలియాలంటే ఈ వీడియో చూస్తే చాలంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.కాగా, న్యూజిలాండ్‌లో భారతీయులు, భారత సంతతికి చెందిన జనాభా పెద్ద సంఖ్యలోనే ఉంది.2018 జనాభా లెక్కల ప్రకారం.ఫిజి ఇండియన్స్‌ సహా భారత సంతతికి చెందిన వారి సంఖ్య 2,30,000 దాటింది.ఇది న్యూజిలాండ్ మొత్తం జనాభాలో 4.7 శాతం కావడం విశేషం.దీపావళి వేడుకలకు ఆ దేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

గతంలో 2017లో కూడా పండుగ వేడుకల్లో న్యూజిలాండ్ పోలీసులు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు