వాహదారుల రక్షణకు సంబంధించి పోలీసు శాఖ ఎన్ని చట్టాలు, చర్యలు తీసుకుంటున్నా అవేమిపట్టనట్లుగా వాహనదారులు వ్యవహరిస్తున్నారు.రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి గత కొంత కాలంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
చర్యలు తీసుకోవడమే కాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారిపై కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు.
మద్యం తాగి, హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాగానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి.
అయితే ఈ తరహా ప్రమాదాలు ఇక జరగకుండా పోలీసు శాఖ కొత్త రూల్‌ను తీసుకొచ్చిందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు వెల్లడించారు.

హెల్మెట్ లేకుండా బైక్ నడిపేవారికోసం ఈ రూల్‌ను తీసుకొచ్చారు.హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారి ఫోటోలు తీసి జరిమానా విధించకుండా బైక్‌ను అక్కడే ఆపి హెల్మెట్ తెచ్చుకునే వరకు బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుంటారట.ఈ నిబంధనను జనవరి 1 నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు అమలులోకి తీసుకొచ్చారు.
బైక్ నడిపేవారే కాకుండా బైక్‌పై వెనుకాల కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నిబంధనను వాహనదారులు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడంతోనే గతేడాది దాదాపు 27 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయని సైబరాబాద్ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి మరీ ఈ కొత్త రూల్ అమలు చేస్తున్నారు.వాహనదారుల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని పోలీసు శాఖ పేర్కొంటుంది.
బైక్ నడిపేవారు, వెనుకాల కూర్చునే వారు ఇకమీదట బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించి వెళ్లండి.