ఉగాది కానుకగా 'కస్టడీ' నుండి ఆసక్తికర పోస్టర్ రిలీజ్!

అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య (Naga Chaitanya) ఒకరు.చైతూను ప్రేక్షకులు ముందు పెద్దగా పట్టించు కోలేదు.

కానీ ఆయన సినిమాలలో చూపిస్తున్న వేరియేషన్స్ కు నాగ చైతన్య కూడా మంచి నటుడు అని మన తెలుగు ప్రేక్షకులు గుర్తించారు.ఇక చైతూ ఒక్కో సినిమాతో హిట్ కొడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

ప్రెజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కస్టడీ(Custody).అయితే నాగ చైతన్య వరుస ప్లాప్స్ తో రేసులో వెనుక ఉన్నాడు.

థాంక్యూ సినిమాతో స్టార్ట్ అయిన ప్లాప్స్ పరంపర ఆ తర్వాత లాల్ సింగ్ చడ్డా వరకు వచ్చింది.దీంతో చైతూ కస్టడీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

Advertisement

రెండు ప్లాప్స్ పడడంతో ఆచితూచి సినిమాలు చేస్తూ సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నాడు.నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న కస్టడీ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు భారీగానే బడ్జెట్ పెడుతున్నారు.ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకుంది.

మరి ఈ రోజు ఈ సినిమా నుండి మరో అప్డేట్ ను మేకర్స్ అందించారు.ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి ఉండగా పోస్టర్ బాగా ఆసక్తికరంగా ఉంది.కాగా ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమా మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

మరి చైతూ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు