దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీదారు హీరో మోటోకార్ప్( Hero MotoCorp ) స్పెండర్ ప్లస్, ప్యాషన్ ప్రో, గ్లామర్, హీరో ఎక్స్‌పల్స్ వంటి బైకులతో సూపర్ పాపులర్ అయింది.వీటితోపాటు బైక్ ప్రియులందరి అభిరుచులకు తగినట్లుగా కొత్తరకం బైకులను పరిచయం చేస్తోంది.
తాజాగా ఈ కంపెనీ కరిజ్మా XMR 210( Karizma XMR 210 ) అనే కొత్త బైక్ పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ ప్రీమియం బైక్ 210cc బలమైన ఇంజన్‌తో 25 హార్స్‌పవర్, 30 న్యూటన్-మీటర్ల టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మొత్తంగా ఇది కూల్ అండ్ పవర్ ఫుల్ బైక్‌గా ఉండబోతోంది.

బైక్ సౌకర్యవంతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది, పెరిగిన హ్యాండిల్‌బార్లు, ఫుట్‌పెగ్‌లతో మీరు దీన్ని సులభంగా నడపవచ్చు.సిటీలోనైనా, హైవేల పైనేనా దీనిపై దూసుకెళ్లవచ్చు.సెక్యూరిటీ పరంగా కరిజ్మా XMR 210 యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో గొప్పగా నిలవనుంది.
ఇది మీకు బైక్‌ను ఎంత వేగం లోనైనా సురక్షితంగా ఆపివేయడంలో సహాయపడుతుంది.హజార్డ్ లైట్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఇందులో అందించారు.ఇది మంచి విజిబిలిటీ కోసం ప్రకాశవంతమైన LED హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లను కూడా కలిగి ఉంటుంది.

బైక్ అంచనా ధర రూ.1.65 నుంచి రూ.1.85 లక్షల మధ్య ఉంటుంది.ఇది యమహా YZF R15, KTM RC200 వంటి ఇతర ప్రసిద్ధ పాపులర్ బైక్స్‌తో పోటీపడుతుంది.ఈ అద్భుతమైన కొత్త బైక్ 2023, ఆగస్టు 29న వస్తోంది! దానిపై అదిరిపోయే రైడింగ్ ఎంజాయ్ చేయడానికి ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
ఈ ఏడాది హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4Vతో పాటు ఆల్రెడీ పాపులర్ అయిన బైక్స్‌కి లేటెస్ట్ వర్షన్ రిలీజ్ అయ్యాయి.సరసమైన ధరల్లో మన్నికమైన, మంచి రైడ్ ఎక్స్‌రియన్స్ ఆఫర్ చేసే వాటిలో హీరో బైక్స్ ఎప్పుడూ ముందంజలో ఉంటాయి అందుకే వీటికి ఇండియాలో విపరీతమైన డిమాండ్ నెలకొంటుంది.