తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.ఆ తర్వాత ఆమె కెరిర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది.
అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు భర్తతో కలిసి ఉండి అనంతరం విడాకులు తీసుకొని విడిపోయింది.ఆ తర్వాత మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది.
ఇక సినిమాల విషయం కంటే ఈమె విడాకుల విషయం పట్ల సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయింది అని చెప్పవచ్చు.
కాగా ఇటీవలే అమలా పాల్ తన మాజీ ప్రియుడు అయిన పవీందర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అంటూ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇలా ఈ మధ్యకాలంలో ఈమె ఏదో విషయం పట్ల సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.అయితే అమలాపాల్ అనగానే చూడ చక్కని అందం.అద్భుతమైన నటన.సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల నటి అమలాపాల్ అంటూ ఆమెపై అందరికీ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది.కానీ రాను రాను అమలాపాల్ అభిమానుల మనసులలో ఉన్న నా ఆలోచనలు తప్పు అన్న విధంగా ప్రవర్తిస్తోంది.
సినిమాలను చాలా వరకు తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్ లను ఎంచుకోవడంలో కూడా పొరపాట్లు చేస్తోంది.

ఇలా నెమ్మదిగా పొరపాట్ల మీద పొరపాటు చేస్తూ హీరోయిన్ గా వెనుకపడుతోంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేవలం ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ, అప్పుడప్పుడు వెకేషన్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతోంది అమలాపాల్.కాగా ఈ మధ్యకాలంలో అమలాపాల్ ప్రేమ పెళ్లి విడాకుల విషయం గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.కాగా ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ A.L విజయ్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఆ వెంటనే మోసం అంటూ.అతనితో బ్రేకప్ చెప్పేశారు.కాని అమల తన మాట వినకుండా సినిమాలు చేయడం వల్లే,విడాకులు కావాలని కోరడం వల్లే.విడిపోయా అంటూ విజయ్ చెప్పి అప్పట్లో అందర్నీ షాక్ చేశారు.అమలదే తప్పనే సెన్స్ అందరిలో కలిగేలా చేశారు.