సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మనం అనేక రకాల వీడియోలను చూస్తూ వస్తున్నాం.అందులో మరీ ముఖ్యంగా వంటకాలకు సంబంధించిన వీడియోలు ఇక్కడ ఎక్కువగా వైరల్ అవుతూ వుంటాయి.
ఎందుకంటే, మనుషులు బేసిగ్గా ఆహార ప్రియులు కాబట్టి.ఈ క్రమంలోనే విచిత్రమైన వంటకాలు చాలా మందిని ఆకర్శిస్తూ వుంటాయి.
ముఖ్యంగా ఎక్కువ మంది ఇష్టపడే ఐస్‌క్రీమ్‌లను మేకర్స్ విచిత్రంగా తయారు చేస్తుండడం షాక్ కలిగిస్తోంది.ఈ క్రమంలో ఒక ఐస్‌క్రీమ్( Ice Cream ) కి సంబందించిన వీడియో ఒకటి నెటిజన్లను షాక్ కి గురి చేస్తోంది.
అవును, తాజాగా ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్‌ను పచ్చి మిర్చితో తయారు చేశాడు.పచ్చి మిరపకాయలను( Chilli ) ఉపయోగించి మరీ ఐస్‌క్రీమ్ రోల్‌ను ఎలా తయారు చేయాలో చూపించాడు మరి.దాంతోనే ఈ వీడియో చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ కాగా సదరు వీడియో ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.విషయంలోకి వెళితే, సూరత్‌లోని ఓ దుకాణంలో ఓ వ్యక్తి “చిల్లీ రోల్ ఐస్‌క్రీం“( Chilli Roll Ice Cream ) తయారు చేశాడు.
పచ్చి మిరపకాయలను ఉపయోగించి ఆ వ్యక్తి ఐస్‌క్రీమ్ రోల్స్ తయారు చేశాడు.చాలా ఘాటుగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను ప్లేట్‌లో వేసి అందించాడు.
అయితే ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోను ఇప్పటివరకు 13 లక్షల మందికి పైగా చూడడం కొసమెరుపు.దాంతో ఈ వీడియోపై నెటిజన్లు( Netizens ) తమదైన శైలిలో స్పందిస్తున్నారు.“బాబోయ్.ఈ ఐస్‌క్రీమ్‌ను ఎలా తినాలి“, “ఇదెక్కడి పైత్యం“ అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే… మరికొంతమంది మాత్రం “స్పైసీ ఫుడ్ తినేవారు ఐస్‌క్రీమ్ ఎందుకు తినాలి“, “దీన్ని తినడం కంటే కాస్త విషం తాగడం బెటర్“ అంటూ చాలా మంది కామెంట్లు చేయడం ఇక్కడ చూడవచ్చు.