అప్పుడప్పుడు సెలబ్రిటీలు కాస్త ఓవర్ గా ప్రవర్తిస్తూ ఉంటారు.చుట్టుపక్క వాళ్ళు తమను గమనిస్తున్నారు అంటే ఆ సమయంలో మరింత ఓవర్గా చేస్తుంటారు.
అదేంటో తెలియదు కానీ.కొన్ని కొన్ని సార్లు అర్థం లేని పనులు కూడా చేస్తుంటారు.
అయితే తాజాగా దివి కూడా అర్థంలేని పని చేయటంతో అందరూ తనపై బాగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.ఇంతకు ఆమె ఏం చేసిందో ఒకసారి తెలుసుకుందాం.
టాలీవుడ్ లో ఇండస్ట్రీకి తొలిసారిగా సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన దివికి బుల్లితెర బాగా కలిసి వచ్చింది.రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అప్పటినుంచి ఈ బ్యూటీ అందరి దృష్టిలో పడింది.
హౌస్ లో ఉన్నంతకాలం ఆటతీరుతో, మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది.తన అందాలతో మాత్రం కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.ఇక బిగ్ బాస్ తర్వాత పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంది.

ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా చేసింది.చిరంజీవి నటించిన సినిమాలో కూడా అవకాశం అందుకోగా ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.ఇక చిన్న చిన్న ప్రాజెక్టులలో మాత్రం అవకాశాలు అందుకుంటున్నట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో మాత్రం సమయాన్ని ఎక్కువగా గడుపుతుంది.నిజానికి తను ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

బిగ్బాస్ షో లో ఉన్నంతకాలం కాస్త పద్ధతిగా కనిపించిన దివి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.ఎప్పుడైతే హౌస్ నుండి ఒక క్రేజ్ అనేది వచ్చిందో ఇక అప్పటినుంచి అవకాశాల కోసం బాగా దిగజారిపోయింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపెట్టేసింది.
దీంతో ఈమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.నిత్యం ఫోటోషూట్లంటూ ఆ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది దివి.
ఇక అప్పుడప్పుడు ట్రిప్స్ కి కూడా వెళుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకుంది.

అయితే అందులో తను ఒక షాపింగ్ మాల్ లో ఉన్నట్లు కనిపించగా.ఆ షాపింగ్ మాల్ లో ఉన్న బొమ్మను పట్టుకొని అక్క చెల్లెళ్ల ముచ్చట్లు అంటూ చెప్పుకొచ్చింది.దీంతో ఆ ఫోటోని చూసిన వాళ్లంతా ఆమెపై మళ్లీ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.మొన్నటి వరకు నీవు కాస్త తేడాగా ప్రవర్తిస్తున్నావని అనుమానం పడ్డాము.ఈరోజుతో అది నిజమైంది.ఎవరైనా బొమ్మతో ముచ్చట్లు పెడతారా.
నీ పిచ్చి కాకపోతే ఇది ఓవర్ కాదా అంటూ నచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.
ఇక ప్రస్తుతం దివి ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేయగా ఆ సినిమా త్వరలో విడుదల కావటానికి సిద్ధంగా ఉంది.
ఇక చాలా వరకు ఈమెను స్పెషల్ సాంగ్ కోసమే తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.ఇలా అయితే భవిష్యత్తులో ఈమెకు నటిగా ఎదిగే అవకాశం లేనట్లు కనిపిస్తుంది.







