ఎన్ని హోమ్ టూర్లు తల్లి.. మంచులక్ష్మి తిరుపతి హోమ్ టూర్ పై నెటిజన్స్ కామెంట్స్!

ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం అందరిలో పాకింది.ముఖ్యంగా సెలబ్రేటీలపై ఎక్కువనే చెప్పవచ్చు.

కరోనా సమయంలో సినిమాలకు దూరంగా ఉండటంతో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు.ఇక అభిమానులు కూడా తమ అభిమానుల నటులతో బాగా ముచ్చట్లు పెట్టారు.

అంతేకాకుండా తమ అభిరుచులను తెలుసుకున్నారు.అక్కడి నుండి మొదలవగా ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటున్నారు సెలబ్రెటీలు.

ఇక ఈ మధ్య హోమ్ టూర్ లంటూ బాగా హడావుడి చేస్తున్నారు.అలా ఇప్పటికీ చాలామంది సెలబ్రేటీలు తమ హోమ్ టూర్ వీడియోలను చూపించారు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి కూడా మరోసారి తన ఇంటి వీడియోను షేర్ చేసుకుంది.తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అంత సక్సెస్ కాలేకపోయింది.బుల్లితెరలో కూడా పలు షోలలో హోస్టింగ్ చేసింది.

ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రామ్ కూడా చేసింది.ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా మారింది.

తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అంతేకాకుండా తను చేసే వర్కవుట్లు వీడియోలను, తన కూతురుకు సంబంధించిన వీడియోలను కూడా తెగ షేర్ చేసుకుంటుంది.ఇక ఇటీవలే యూట్యూబ్ లో తన పేరుమీద ఓ ఛానెల్ ను కూడా క్రియేట్ చేసుకుంది.ఇక అప్పటి నుంచి ఎన్నో వీడియోలు షేర్ చేసుకుంటూ లైకులు, కామెంట్లు, ట్రోల్స్ బాగా ఎదుర్కొంటుంది.

Advertisement

అయినా కూడా తను తనకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూనే ఉంటుంది.

గతంలో మంచు లక్ష్మి హోమ్ టూర్ వీడియో లంటూ తన ఇల్లు, తన తండ్రి మంచు మోహన్ బాబు ఇళ్ల వీడియోలను పంచుకుంది.అందులో తమ ఇంటికి గదులను, ఇంటీరియర్ డిజైన్ లను చూపించింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తిరుపతి హోమ్ టూర్ అంటూ తన మరో ఇంటిని హోమ్ టూర్ చేసి చూపించింది.

ఇక అందులో తన ఇల్లు మొత్తాన్ని, ఇంట్లో ఉన్న డిజైన్స్ మొత్తం అన్ని చూపించింది.ఇక ఈ వీడియోకు లైక్ లతో పాటు కామెంట్లు కూడా తెగ వస్తున్నాయి.

ఇక కొందరు నెటిజన్లు మాత్రం ఆమె హోమ్ టూర్ వీడియోలను చూసి బాగా విసిగిపోయారు.ఇప్పటికే ఎన్నో వీడియోలు చూపించావు అంటూ.ఇంకెన్ని హోమ్ టూర్లు చూపిస్తావు తల్లి అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ కామెంట్ లో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక కొందరు ఇంకేం హోమ్ టూర్ చుపిస్తావ్ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

మరి మంచు లక్ష్మి నెక్స్ట్ ఏ హోమ్ టూర్ చూపిస్తుందో చూడాలి.అసలు ఈ కామెంట్లకు చూపిస్తుందో లేదో కూడా చూడాలి.

తాజా వార్తలు