డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రవి ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ బాబు లుక్, ఫస్ట్ గ్లింప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఈ సినిమా కోసం ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ భాగంలో కూడా సర్వం సిద్ధమయ్యాడు మహేష్ బాబు.
ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మే మొదటి వారం అంతా మహేష్ బాబు ప్రమోషన్ షెడ్యూల్ లో బిజీగా ఉండనున్నట్లు తెలుస్తుంది.10 వరకు మీడియా ఇంటర్వ్యూ లలో, సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పైగా దర్శకులతో పాటు ప్రమోషన్స్ ప్లాన్స్ ఉన్నాయని సమాచారం.అంతే కాకుండా భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ను కలవబోతున్నాడట.మొత్తానికి మహేష్ బాబు ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ తో ఉన్నట్లు.మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది.
ఇక దీనిని బట్టి చూస్తే సినిమా పట్ల మహేష్ బాబు దూకుడు బాగా కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది.అంతేకాకుండా
కథ
కూడా మామూలుగా ఉండదు అన్నట్లుగా టాక్ నడుస్తుంది.
మరి ఈ సినిమా మహేష్ బాబు కు ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.