ప్రస్తుతం సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు, స్టార్ క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలు క్షణాల్లోనే ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా ఇదే కోవలో ఓ స్టార్ క్రికెటర్ చిన్ననాటి ఫొటో ట్రెండ్ అవుతోంది.టీమిండియా తరఫున మైదానంలోకి దిగిన అతను పరుగుల వరద పాటించాడు.
ఫార్మాట్లతో పని లేకుండా తన బెంచ్ మార్క్ క్రియేట్ చేసాడు.ఎవరికీ సాధ్యం కాని మూడు డబుల్ సెంచరీలను సునాయాసంగా అందుకున్నాడు.
అతని ఆట, అతని సామర్ధ్యాన్ని చూసి బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ అతనిని టీమిండియా సారథిగా బాధ్యతలు అప్పగించింది.ఇలా క్రికెటర్ గా, కెప్టెన్‌గా భారత జట్టుకు విజయాలు అందిస్తోన్న ఈ స్టార్ ఆటగాడు మరెవరో కాదు.
ఇండియన్ కెప్టెన్, ముందుగా హిట్ మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ.
2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్ లో టీమిండియా జెర్సీని తొలిసారి వేసుకున్న రోహిత్ శర్మ.
అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకున్నాడు.అయితే రోహిత్ శర్మ ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక ఎత్తు పల్లాలను చూడాల్సి వచ్చింది.
కెరీర్ ఆరంభంలో నిలకడలేమితో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.జట్టులోకి వస్తూ పోతూ ఉండిపోయాడు.
క్రికెట్ పట్ల అతడికి ఉన్న అంకిత భావం నేడు ఈ స్థాయికి చేరుకునేలా చేసింది.ఎప్పుడైతే ఓపెనర్‌గా అవతారమెత్తాడో అప్పుటి నుంచి నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు ఈ డ్యాషింగ్ క్రికెటర్.

ఈక్రమంలోనే పరుగుల పరంగా ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టును తన కెప్టెన్సీలోనే ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన ఘనత రోహిత్ కే దక్కింది.ఈక్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ మరిన్ని రికార్డులు సాధించాలని, టీమిండియాకు అద్భుత విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.








