టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ ( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.
నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అందం పరంగా కూడా ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.పెళ్లయ్యాక కూడా కుర్రాళ్ళ మదిలో క్రష్ గా ఉందంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడైన బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూ ను( Gautam Kitchlu ) ప్రేమించి వివాహం చేసుకుంది.అప్పటివరకు తన ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా సైలెంట్ గా డీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
పైగా ఇప్పటివరకు ఎటువంటి గాసిప్స్ కూడా ఎదుర్కోలేదు.పెళ్లికి ముందు కూడా ఎటువంటి ఎఫైర్లు కూడా ఈ బ్యూటీ దరికి చేరలేవు.

అంతకాలం రహస్యంగా ప్రేమలో ఉండి ఒకేసారి పెళ్లితో షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ సమయంలో తన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు.తమ క్రష్ పెళ్లి చేసుకోవడంతో చాలామంది కుర్రాళ్ళు తట్టుకోలేకపోయారు.ఇప్పటికీ కాజల్ తన భర్తతో క్లోజ్ గా ఉంటే చాలు కుర్రాళ్ళు కుళ్ళు తో చస్తారు.ఇక పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్టుతో పలు సినిమాల్లో నటించింది.

అంతేకాకుండా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో( Acharya Movie ) కూడా అవకాశం అందుకుంది.కానీ ఆ సమయంలో తను ప్రెగ్నెంట్ కావడంతో ఆ సినిమాను వదులుకుంది.ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు తీపి కబురు చెప్పింది.
అలా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇక తన బాబుకు సంబంధించిన ఫోటోలను, తన భర్తకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటూ ఉంటుంది.

ఇక మళ్లీ సినీ ఇండస్ట్రీ కి రీఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఇప్పటికే ఒక సినిమాలో కూడా నటిస్తుందని తెలిసింది.ఇక పలు యాడ్స్ లు కూడా చేసింది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కాజల్ ఒక పార్టీలో పాల్గొనగా ఆ సమయంలో తన భర్తతో దిగిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
అందులో తన భర్తతో రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చింది.ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు కోపంతో కనిపిస్తున్నారు.
బేబీ నువ్వు వాడితో అంత క్లోజ్ గా ఉండదు అంటూ ఒక అభిమాని కామెంట్ చేయగా.మరో నెటిజన్.
తెలుగు హీరోస్ ని మర్చిపోకు.వాళ్లతో మెమరీస్ ఉన్నాయి నీకు అంటూ కామెంట్ చేయటంతో.
వెంటనే మిగతావాళ్లు ఏం మెమోరీస్ ఉన్నాయి అంటూ ఆరా తీస్తున్నారు.ఇక ఏదైతే ఏంటి.
ప్రస్తుతం కాజల్ తన భర్తతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో అవకాశాలు అందుకుందని తెలుస్తుంది.







