బాలీవుడ్ సినీ నటుడు,దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడినని చెప్పుకుంటూ పెద్ద ఎత్తున పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న వారిలో ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు ( Umair Sandu ) ఒకరు.ఈయన సోషల్ మీడియా వేదికగా తరచూ బాలీవుడ్( Bollywood ) సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈయన వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ కేసులు కూడా నమోదు చేశారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో ఉమైర్ సందు టాలీవుడ్ సెలబ్రిటీల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు గే అంటూ ఆయన ఫోటోని షేర్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) కుమారుడు ఇబ్రహీం( Ibraheem ) అలీ ఖాన్ ఫోటోని షేర్ చేసిన ఉమైర్ సందు ఆయన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇబ్రహీం అలీ ఖాన్ గే అయ్యాడు అంటూ ఈయన కామెంట్ చేశారు.అసలు ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఏమవుతుంది ఎందుకు వీళ్లంతా స్వలింగ సంపర్కులుగానే మారిపోతున్నారు అంటూ కామెంట్ చేశారు.

ఈ విధంగా సైఫ్ అలీ ఖాన్ కుమారుడిని పట్టుకొని గే అంటూ ఉమైర్ సందుచేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈయన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సైఫ్ అలీ ఖాన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇలా అభిమానులు మండిపడుతూ ఉన్నప్పటికీ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు కొందరు మాత్రం ఈయన వ్యాఖ్యల పట్ల పెద్దగా రియాక్ట్ కాకపోవడమే కాకుండా చాలా సిల్లీగా తీసుకుంటున్నారు.ఇక ఈయన గతంలో టాలీవుడ్ హీరోలైనటువంటి మహేష్ బాబు విజయ్ దేవరకొండ రష్మిక వంటి సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.







