మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఆరు నెలల లోపు ట్రయల్ పూర్తి కాకపోతే రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం చెప్పింది.అనంతరం హత్య కేసులో విస్తృత కుట్రపై విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీలోపు విచారణను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.సీబీఐ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు… దర్యాప్తు అధికారి మార్పుపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలుస్తోంది.
అయితే న్యాయస్థానం ఆదేశాలతో ఏప్రిల్ చివరి నాటికి వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్తి చేస్తామన్న సీబీఐ ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్ ను తప్పించినట్లు తెలుస్తోంది.అనంతరం కొత్త సిట్ ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది.
సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్ పని చేస్తుందని సీబీఐ పేర్కొంది.







