నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు మాత్రమే బయటపెట్టానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

తన ఆరోపణలు అధికారుల మీద కాదన్న ఆయన ప్రభుత్వ పెద్దలపైనేనని పేర్కొన్నారు.

సీఎం జగన్ కు నమ్మక ద్రోహం చేసి ఉన్నా, తను చేసిన దాంట్లో తప్పు ఉన్న నాశనం చేయమని దేవుడిని చేతిలో రుద్రాక్ష పట్టుకుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.తను ఏ తప్పు చేయకుండా ఉంటే దేవుడే మంచిచేస్తాడన్నారు.

తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు.చిత్తశుద్ధితో పని చేస్తే అనుమానించారని, అందుకే మనసు విరిగి అధికారాన్ని వదులుకుని వెళ్తున్నట్లు వెల్లడించారు.

మాజీ మంత్రి తనను విమర్శించారని చెప్పారు.ఏదైనా ఉంటే తనతో డైరెక్ట్ గా మాట్లాడాలని అనిల్ కు తెలిపారు.

Advertisement

అనిల్.నా కుటుంబం, నీ కుటుంబం అంతా ఒకటే అనుకున్నానన్న ఆయన గతాన్ని మర్చిపోయావా అని ప్రశ్నించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు