నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర విషయం తెరమీదికి వచ్చింది.నిన్న మొన్నటివరకు తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, తమ పనులు సాగడం లేదని గగ్గోలు పెట్టిన ఇక్కడి రెడ్డి సామాజిక వర్గం నేతలు.
ఇప్పు డు మరో వివాదాన్ని తెరమీదికి తెచ్చారు.గత ఎన్నికల్లో క్లీన్ స్పీప్ చేసిన వైసీపీకి.
రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎక్కువగా ఉన్నారు.ఎవరికి వారే సీనియర్లు కావడం, మంత్రి పీఠాలను ఆశించడం పార్టీలో ఆధిపత్యానికి కారణమైంది.
అయితే, పార్టీ అధినేత, సీఎం జగన్ మాత్రం సౌమ్యుడు, వివాద రహితుడు మేకపాటి గౌతం రెడ్డికి, బీసీ కోటాలో అనిల్ కుమార్ యాదవ్‌కు అవకాశం కల్పించారు.
అయితే, అనిల్ దూకుడుగా ఉండడం, ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేసుకోవడంతో జిల్లాపై పట్టు సాధించేం దుకు ఆయనే ప్రయత్నించారు.
జగన్ కూడా అనిల్ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించారు.ఇది రెడ్డి సామాజిక వర్గానికి ఇబ్బందిగా మారింది.మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఈ విషయంలో బాహాటంగానే పార్టీపై విమర్శలు గుప్పించారు.ప్రసన్న కుమార్‌రెడ్డి బయట పడకపోయినా.
ఆధిపత్య ధోరణిలో వ్యాఖ్యలు చేశారు.ఇక, కాకాని గోవర్ధన్‌రెడ్డి సొంత నేతలతో వివాదాలకు దిగారు.
ఇలా.తమకు స్వతంత్రం లేకుండా పోయిందని.మా పాలనలో కూడా మాకు న్యాయం జరగడం లేదని వారు గగ్గోలు పెట్టారు.

ఈ క్రమంలోనే ఇటీవల జిల్లా వ్యవహారాలను అనిల్ నుంచి తప్పించి.మేకపాటి గౌతం రెడ్డికి అప్పగించా రు జగన్.ఈ విషయంలో ఎక్కడా ప్రచారం జరగకపోయినా.
మేకపాటికే జిల్లా ఎమ్మెల్యేలను సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించారు.దీంతో రెడ్డి వర్గంలో ఒకింత రిలీఫ్ వస్తుందని అనుకున్నారు.
కానీ, ఇప్పుడు అసలు సిసలు ఒత్తిళ్లు వస్తున్నాయి.మేకపాటిని తమకు అనుకూలంగా తిప్పుకొనేందుకు నేతలు ఎవరికి వారే.
ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానిక సమస్యలను నేరుగా ఆయనకు చెప్పకుండా.
ఒత్తిడి పెంచేలా.సదరు వర్గాలను రెచ్చగొట్టడం.
ధర్నాలు, నిరసనలకు ప్రోత్సాహం ఇవ్వడం వంటివి అసలు మేకపాటిపై వారు ఏం చేయాలనుకుంటున్నారో.అర్ధం కావడం లేదని అంటున్నారు పరిశీలకులు.
వీరి దూకుడుతో మంత్రి మేకపాటి.ఇబ్బంది పడుతున్నారట.
మరి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.