Neha Shetty : టిల్లు స్క్వేర్ లో అలాంటి పాత్రలో నేహా శెట్టి.. ఫ్యాన్స్ కి పండగే?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్.

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

గతంలో విడుదలైన డిజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగావంశీ నిర్మించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు,పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.

దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది.

Advertisement

ఆ సంగతి పక్కన పెడితే డీజే టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.డీజే టిల్లు సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఆ సినిమాలో రాధిక అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా విడుదల తర్వాత చాలామంది రాధిక అని పిలవడం కూడా మొదలుపెట్టారు.కానీ ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం అనుపమ హీరోయిన్( Anupama Parameswaran ) గా నటిస్తోంది.

అయితే నేహా శెట్టి హీరోయిన్గా చేసి ఉంటే బాగుండేది అని ఆమె అభిమానులు ఎంతో ఆశపడ్డారు.కానీ ఈ విషయంలో వారికి నిరాశ ఎదురయ్యింది.

ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎంట్రీ తప్పకుండా ఉంటుందట.కొద్దిసేపు టిల్లు స్క్వేర్ సినిమాలో రాధిక సందడి చేయబోతుందని తెలుస్తోంది.ఒక స్పెషల్ పాత్రలో నేహా శెట్ట నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే నేహా శెట్టి అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

Advertisement

కదా ఈ వార్త సోషల్ మీడియాలో వేరే లెవ్వడంతో ఏం.రాధిక.ఇంకా.

మాటిల్లు గాడిని వదల లేదా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు