రాజీనామా చేసిన నీలం సాహ్ని..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ పదవీ బాధ్యతలను మార్చి నెలాఖరున నీలం సాహ్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియడంతో .

ఏపీ ప్రభుత్వం ఇటీవల ముగ్గురి పేర్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.ఆ ముగ్గురిలో నీలం సాహ్ని పేరును ఓకే చేసి ఎస్ఈసీ బాధ్యతలు అప్ప చెప్పడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పదవికి నీలం సాహ్ని రాజీనామా చేయడంతో ఏపీ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది.గతంలో చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని రాష్ట్రానికి సేవలందించారు.

అప్పుడు పదవీకాలం ముగియడంతో వెంటనే జగన్ ప్రభుత్వం.ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి ఆమెకు కట్టబెట్టటం జరిగింది.

Advertisement

అయితే ఇప్పుడు ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేయడం జరిగింది.ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ఎంపిక కావడం విశేషం.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు