ఏపీ ఎన్నికలపై ఎన్డీ టీవీ సర్వే.. మరోసారి వైఎస్ఆర్‎సీపీదే విజయం..!

ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది.అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఓటరు నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పలు సంస్థలు వివిధ సర్వేలను నిర్వహించాయి.

ఇప్పటికే నేషనల్ మీడియా సంస్థ టైమ్స్ ( national media company )నౌ సర్వే ఫలితాలను వెల్లడించగా.తాజాగా మరో నేషనల్ మీడియా సంస్థ ఎన్డీటీవీ సర్వే ఫలితాలను ప్రకటించింది.

తాజాగా ఎన్డీ టీవీ ( ND TV ) చేపట్టిన సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో ఈ సారి కూడా వైఎస్ఆర్‎సీపీ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సరే ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను వైఎస్ఆర్‎సీపీ 16 సీట్లలో విజయం సాధిస్తుందని తేలింది.

Advertisement

ప్రతిపక్ష పార్టీ ఎన్డీఏ ( టీడీపీ - బీజేపీ - జనసేన) కూటమి కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఎన్డీ టీవీ ఫలితాల్లో పేర్కొంది.

ఏపీలో వైఎస్ జగన్ ( YS Jagan in AP )ప్రభుత్వంపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని ఎన్డీ టీవీ సర్వే ఫలితాల్లో వెల్లడించింది.లోక్ సభ స్థానాల్లో విజయ దుంధుభి మోగించనున్న వైఎస్ఆర్‎సీపీ అసెంబ్లీ ఫలితాల్లోనూ ఇదే జోష్ కొనసాగించనుందని సర్వే చెబుతోంది.ఈ క్రమంలోనే ఒక్కో లోక్ సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలను తీసుకుంటే వైఎస్ఆర్‎సీపీకి సుమారు 130 కి పైగా సీట్లు లభించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

దీంతో భారీ మెజార్టీతో వైఎస్ జగన్ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

వివిధ సర్వే ఫలితాలను బట్టి ఏపీలో ఈ సారి కూడా వైఎస్ఆర్‎సీపీ ప్రభంజనం సృష్టించనుందని స్పష్టం అవుతుంది.దీంతో ఫలితాలు అధికారికంగా వెల్లడి కాగానే వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలనే విషయంపై వైఎస్ఆర్‎సీపీ నేతలు చర్చిస్తున్నారట.నేతలతో పాటు ఏపీ ప్రజలు కూడా వైఎస్ జగనే సీఎం అవుతారని చెబుతున్నారు.

ఐదేళ్ల పాలనలో రాష్ట్రం నాశనం.. జగన్ పై దేవినేని ఫైర్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురు నిర్వాహకులు అరెస్ట్

ఇందుకు కారణం ఆయన రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమమే అని చెప్పొచ్చు.కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవానికి సంక్షేమాన్ని గడపకు చేరవేసిన వైఎస్ జగనే మరోసారి సీఎం అవుతారని ఏపీ వాసులు తెలియజేస్తుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు