ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి.దీంతో ఇప్పటికే ఆఫ్గనిస్థాన్ దేశంలో నివాసం ఉంటున్న ఇతర దేశాల పౌరులను తమ దేశాలు వెనక్కి రప్పించి కుంటున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, భారతదేశం, పాకిస్తాన్, తదితర దేశాలకు చెందిన పౌరులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాల్లో తమ దేశాలకు చేరుకున్నారు.అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని బాల్క్ ప్రావిన్స్ ప్రాంతంలో “నజీనన్” అనే 21 సంవత్సరాలు కలిగిన యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.కాగా ఇటీవలే నజీనన్ పని నిమిత్తమై బయటకి వచ్చింది.
ఈ క్రమంలో నజీనన్ బుర్ఖా ధరించకుండా బిగుతు దుస్తులు ధరించి ఉంది.దీంతో ఇది గమనించిన తాలిబన్లు నజీనన్ ని దారుణంగా చెట్టుకు కట్టేసి బుర్ఖా దుస్తులు వేసి అందరూ చూస్తుండగానే సజీవ దహనం చేశారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది.అంతటితో ఆగకుండా తాలిబన్లు మహిళలు బాహ్య ప్రపంచంలో సంచరించేటప్పుడు కచ్చితంగా బుర్ఖా దుస్తులను ధరించి బయటకు రావాలని లేకపోతే దారుణంగా హతమారుస్తామని హెచ్చరిస్తున్నారు.
దీంతో ప్రపంచ దేశాలు సైతం తాలిబన్ల ఆగడాలను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలు ఎక్కువవుతాయని కాబట్టి వెంటనే తాలిబన్లను అరికట్టే ప్రయత్నాలు, చర్యలు మొదలు పెట్టాలని సూచిస్తున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ దేశ అధ్యక్షుడు దేశాన్ని వదిలి పెట్టి తన కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడు.దీంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించిన తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.అంతేకాకుండా దేశంలోని ప్రముఖుల ఇళ్లలో చొరబడి డబ్బు, నగలు, మరియు ఖరీదైన వస్తువులను దొంగలిస్తున్నారు.
దీంతో ఆగ్రహించిన ప్రజలు తమని కాపాడాలంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్నాయి.ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రముఖ క్రికెటర్ మరియు రషీద్ ఖాన్ కూడా తమ దేశాన్ని కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ ని షేర్ చేశాడు.