వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరోయిన్ నయనతార మూవీ.. బ్యాన్ చేయాలంటూ?

లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

హిందీ కన్నడ, తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది నయనతార.ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార 75వ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

ఆ సినిమా మరేదో కాదు అన్నపూరణి.ఈ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్‌ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

నికిలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చింది.కానీ ఈ చిత్రం కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది.

Advertisement

జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది.ఈ చిత్రంలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా నటించింది.

ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కోరిక ఆమెలో ఉంటుంది.దీనిని ఆమె తండ్రి వ్యతిరేకిస్తాడు.

అయితే, తండ్రి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా నయనతార ఎలా ఎదిగింది.ఆ తర్వాత ఆ రంగంలో ఆమెకు ఎదురయ్యే సవాల్ ఏంటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది.

ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో తాజాగా చిత్ర యూనిట్ తో హీరోయిన్ నయనతార కూడా చెన్నైలోని ఒక లేడీస్ కాలేజీ ని సందర్శించారు.లంచ్‌ టైమ్‌కి వెళ్లి వారందరితో సందడిగా కనిపించారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఆపై వారందరికీ స్వయంగా నయనతారనే బిర్యానీ వడ్డించారు.అలా ఒక్కసారిగా తమ అభిమాన తారలను చూడగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.సాధారణంగా నయనతార సినిమా విడుదల సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయదు.

Advertisement

వాటంన్నిటికీ ఆమె కాస్త దూరంగానే ఉంటారు.కానీ అన్నపూరణి చిత్రం కోసం నయనతార ఇప్పుడిలా చేయడంతో యూనిట్‌ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువతి పాత్రలో నయనతార ఇందులో నటించడం ఆపై ఆమె ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదిగే క్రమంలో ఆమె చేస్తున్న వంటలు పలు వివాదాలకు దారి తీసింది.ఇందులోని కథాంశం కూడా బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా ఉందని రాష్ట్రీయ హిందూ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు వేలు తెలిపాడు.

దానికి తోడు ముస్లిం యువకుడు బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తున్నట్లు ఈ చిత్రంలో చూపించడంపై ఆయన తప్పుబట్టారు.సినిమాను బ్యాన్ చేయాలని ఆయన కోరారు.

సినిమా మేకర్స్‌ పై సివిల్ కేసు పెట్టడమే కాకుండా థియేటర్ల వద్ద దిగ్బంధనం చేస్తామని వేలు హెచ్చరించారు.హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం కరెక్ట్‌ కాదని ఆయన తెలిపారు.

మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు