వాళ్లకు త్రిష చుక్కలు చూపిస్తుంది

త్రిష లీడ్ రోల్ చేస్తూ నటిస్తున్న సినిమా నాయకి.గోవి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను త్రిషకు మేనేజర్ గా చేసిన గిరిధర్ నిర్మించడం విశేషం.

తెలుగు తమిళ భాషల్లో ఈ నెల 15న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసిన నాయకి ప్రమోషన్స్ కు రానంటూ త్రిష ప్రొడ్యూసర్ ను ఇబ్బంది పెడుతుందట.సినిమాకు ఇప్పటికే చాలా రిస్క్ తీసుకున్న ఫీలింగ్ లో ఉన్న అమ్మడు అది రిలీజ్ టైంలో దర్శక నిర్మాతలకు కోపరేషన్ చేయట్లేదట.

ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన త్రిష నాయకి జూలై 15న రిలీజ్ అవుతుంది.మరి సినిమాలో నటించడమే కాదు జనాల్లోకి వెళ్లాలంటే ఓ రేంజ్ ప్రమోషన్స్ కూడా నడిపించాలి.

అయితే ఆ విషయలో త్రిష స్టార్డం ఉన్నప్పటి నుండి ఇదే ప్రవర్తనతో ఉంది అంటున్నారు సిని జనాలు.సినిమా రిలీజ్ టైంలో కేవలం రెండు ఇంటర్వ్యూలే తప్ప మిగతా ప్రమోషన్స్ తన వల్ల కాదని ముందే చెబుతుందట.

Advertisement

అయితే అన్ని సినిమాలు ఓ ఎత్తైతే త్రిష నాయకి మరో ఎత్తు.ప్రస్తుతం కెరియర్ క్లోజ్ అవుతున్న టైంలో వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ అన్ని విధాలుగా వాడుకోవాలి.

త్రిష మనసు మార్చుకుని నాయకి ప్రమోషన్స్ కు నడుం బిగుస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు