ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు ఎందులో విజయం సాధించాలి అన్న చిన్నప్పటి నుంచి బద్ధకం లేకుండా పని చెయ్యాలి.అప్పుడే విజయం సాధించగలరు.
ఎందరికో ఆదర్శంగా ఉండగలరు.ఇంకా సినీ ఇండస్ట్రీలో వెళ్తే.
ఎంత పెద్ద స్టార్ అయినప్పటికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే అవమానాలు తప్పవు, చివాట్లు తప్పవు.
కొందరి జీవితంలో అవమానాలు, హేళనలు ఉంటే మరికొందరి జీవితాల్లో కష్టాలు, కూటి కోసం ఆరాటపడ్డ క్షణాలు కనిపిస్తుంటాయి.
ఇంకా ఎంతోమంది పడిన కష్టాలనే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడ పడ్డాడు.అయన జీవితంలో సంతోషం కంటే కూడా కష్టాలే ఎక్కువ ఉన్నాయ్.
1974లో ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన నవాజుద్దీన్ సిద్ధిఖీ చదువుకునే రోజుల్లోనే ఎన్నో కష్టాలు పడ్డాడు.ఆకలి తీరే పరిస్థితి లేదు.
స్కూల్ లో చదివే సమయంలోనే కొత్తిమీర కట్టలు, కూరగాయలు అమ్మేవాడు.రోజు కూరగాయల మార్కెట్ కి వెళ్లి అక్కడ కొనుగోలు చేసి వాటిని ఇంటి దగ్గర అమ్మేవాడు.
అలాంటి నవాజుద్దీన్ కి సినిమాల్లో నటించాలని ఉండేది.అందుకే ఎటువంటి సపోర్ట్ లేకపోయినప్పటికి అప్పటికే బంధుప్రీతి బాగా ఉన్నప్పటికీ జూనియర్ ఆర్టిస్టుగా నటించడం ప్రారంభించాడు.మొదట్లో నెలకి కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు.అందుకే ఆ సమయంలో అతను రూ.1800 పెట్టుబడి పెట్టి సబ్బులు అమ్ముతూ వచ్చాడు.
కొద్దిరోజులకు అవకాశాలు పెరగడంతో అన్ని వ్యాపారాలు ఆపేసి నటనపైనే పూర్తి దృష్టి పెట్టాడు.దీంతో బాబా సాహెబ్, మున్నాభాయ్ MBBS న్యూయార్క్, బాంబే టాకీస్, హౌస్‌ఫుల్ 4, బోలే చుడియాన్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి న్యూరో ఎండోక్రిన్ కాన్సర్ సోకింది.దీంతో అతను కొన్ని నెలలుగా ముంబైలోని కోకోలాబ్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరాడు.ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.ఏది ఏమైనా చిన్న పని అయినా ఇష్టంతో ప్రారంభిస్తే ఎంత ఎత్తుకు అయినా ఎదగచ్చు అనేది ఇతన్ని చూస్తేనే అర్థం అవుతుంది.