ఆ డైరెక్టర్ తో సినిమా చేసేది లేదంటూ హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్..ఇబ్బందుల్లో పడ్డ నిర్మాతలు!

ప్రస్తుతం ఇండస్ట్రీ లో అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్న హీరో నవీన్ పోలిశెట్టి.

( Naveen Polishetty ) అంతకు ముందు యాంకర్ గా చేస్తూ, చిన్న చిన్న పాత్రల ద్వారా ఆడియన్స్ ని పలకరించిన నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రం తో తొలిసారి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ చిత్రం లో చూసినప్పుడే అందరికి అనిపించింది.ఎవరీ కుర్రాడు చాలా అందం గా ఉన్నాడు, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది , ఎమోషన్స్ కూడా ఓవర్ డ్రామా లేకుండా చాలా చక్కగా సహజంగా చేసాడు అని అందరూ అనుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన జాతి రత్నాలు( Jathi Ratnalu ) చిత్రం కమర్షియల్ గా వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.సుమారుగా 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి నవీన్ పోలిశెట్టి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

ఈ చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆయన మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) సినిమాతో మన ముందుకు వచ్చాడు.

Advertisement

ఈ సినిమా కాస్త స్లో గా ఉంది అనే టాక్ వచ్చినప్పటికీ కూడా నవీన్ పోలిశెట్టి సెకండ్ హాఫ్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు.దీనితో యావరేజి అవ్వాల్సిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి, నవీన్ పోలిశెట్టి కెరీర్ లో హ్యాట్రిక్ ని పూర్తి చేసింది.

ఇక ఈ చిత్రం తర్వాత నుండి నవీన్ పోలిశెట్టి స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఆచి తూచి అడుగులు వెయ్యబోతున్నాడు.అందులో భాగంగా గతం లో ఆయన కళ్యాణ్ శంకర్ తో ప్రారంభించిన అనగనగా ఒక రాజు( Anaganaga Oka Raju ) అనే సినిమాని హోల్డ్ లో పెట్టాడు.అందుకు కారణం ఇప్పటి వరకు తీసిన ఈ సినిమా ఔట్పుట్ నవీన్ పోలిశెట్టి కి పెద్దగా నచ్చలేదు అనే.అందుకే ఈ చిత్రం నుండి కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) నుండి తీసేసి అనుదీప్ ని( Anudeep ) పెట్టాల్సిందిగా నవీన్ పోలిశెట్టి నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నాడట.

ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.అనుదీప్ గతం లో నవీన్ తో జాతి రత్నాలు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రానికి కూడా అతనే కావాలని అడుగుతున్నాడట.

కళ్యాణ్ శంకర్ రీసెంట్ గా మ్యాడ్ ( Mad Movie ) అనే సినిమాకి దర్శకత్వం వహించి సూపర్ హిట్ ని అందుకున్నాడు.ఆ సినిమాని మంచిగానే తీసాడు కానీ, అనగనగ ఒక రాజు చిత్రాన్ని మాత్రం సరిగా తియ్యలేదట.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

అందుకే నవీన్ పోలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు