మనకు ఉంది రెండు ఆప్షన్లే అంటున్న నాని..!

నాచురల్ స్టార్ నాని వ్యాక్సిన్ వేయించుకున్నారు.కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటో షేర్ చేస్తూ ఇప్పుడు మనకుంది రెండే ఆప్షన్లని.

అందులో మొదటిది వ్యాక్సిన్ వేయించుకుని క్షేమంగా ఉందాం.రెండవది.

మన క్షేమం కోసం వ్యాక్సిన్ వేయించుకుందాం.అని పోస్ట్ చేశారు.

వ్యాక్సిన్ వల్లే కరోనాని నియంత్రించ వచ్చని చెబుతూ తన మార్క్ ఫన్నీ మెసేజ్ ఇచ్చారు నాని.నాని చేసిన ఈ పోస్ట్ కు ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

కరోనా సెకండ్ వేవ్ ఊహించని పరిణామాలను తెచ్చింది.సినీ పరిశ్రమలో కూడా సెకండ్ వేవ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక రాబోయే థర్డ్ వేవ్ పై కూడా అందరు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.ఈ క్రమంలో నాని తన సోషల్ మీడియాలో వ్యాక్సిన్ పై తన అభిప్రాయాన్ని తెలియచేశారు.

వ్యాక్సిన్ ఉంటేనే సేఫ్ గా ఉంటామని చెప్పారు.ఇక సినిమాల విషయానికి వస్తే నాని టక్ జగదీష్ రిలీజ్ కు రెడీ అవగా శ్యాం సింగ రాయ్ షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు.

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న శ్యాం సింగ రాయ్ సినిమాను రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు