ఇటీవల కాలంలో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించినటువంటి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ అవేంటో ఒకసారి లుక్కేద్దాం…
దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ కథకి హీరోగా న్యాచురల్ స్టార్ నాని అనుకొని ముందుగా ఈ కథనే నాని కే వినిపించాడట.
అయితే ముందే ఈ చిత్ర భవిష్యత్తుని పసిగట్టిన అటువంటి నాని అందుకు నో చెప్పాడట.అంతేగాక తనకు నచ్చినట్లు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే నటిస్తానని చెప్పడంతో దర్శకుడు క్రాంతి మాధవ్ మార్పులకు చేర్పులకు నో చెప్పాడట.
అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ స్క్రిప్ట్ ని పట్టుకొని విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లగా విజయ్ దేవరకొండ వెంటనే ఓకే చేశాడట.ఆ విధంగా వరల్డ్ ఫేమస్ లవర్ కి విజయ్ దేవరకొండ బలయ్యా డని టాలీవుడ్ లో పలువురు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
అయినా ఏదేమైనప్పటికీ కథల విషయంలో ఓ మోస్తరుగా నాని ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దాని “వి” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నాని నెగిటివ్ రోల్ కలిగినటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నాని తో పాటు సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి, తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.