డ్రై గా మారిన జుట్టును ఒక్క వాష్ లోనే రిపేర్ చేసే హోమ్ రెమెడీ మీకోసం!

సాధారణంగా ఒక్కోసారి జుట్టు పూర్తిగా డ్రై అయిపోతుంటుంది.ఆ సమయంలో జుట్టును ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియ‌న తెగ‌ సతమతం అయిపోతుంటారు.

మరి కొందరు సెలూన్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి జుట్టును మళ్లీ మామూలు స్థితికి తెచ్చుకుంటూ ఉంటారు.కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా డ్రై గా మారిన జుట్టును రిపేర్ చేసుకోవచ్చు.

అది కూడా ఒక్క వాష్ లోనే.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అంటే చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

Natural Remedy For Repairing Dry Hair Dry Hair, Hair Care, Hair Care Tips, Home

ఈ హోమ్ రెమెడీని పాటిస్తే డ్రై గా మారిన మీ జుట్టు మళ్ళీ స్మూత్ గా సిల్కీగా షైనీ గా మెరుస్తుంది.మ‌రి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు( Clove ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

Natural Remedy For Repairing Dry Hair Dry Hair, Hair Care, Hair Care Tips, Home
Advertisement
Natural Remedy For Repairing Dry Hair! Dry Hair, Hair Care, Hair Care Tips, Home

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు, లవంగాలను వాటర్ తో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్ లో ఒక ఎగ్ వైట్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మీ జుట్టు ఎంత డ్రై గా ఉన్నా సరే ఒక్క వాష్ లోనే రిపేర్ అవుతుంది.

మళ్లీ మీ కురులు స్మూత్ గా సిల్కీగా మారుతాయి.షైనీ గా మెరుస్తాయి.పైగా వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుముఖం పడతాయి.

హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు