దేశమంతా ఓ వైపు దిశపై జరిగిన అత్యాచారం, హత్య గురించి చర్చించుకుంటోంది.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలపై చట్టసభలు దృష్టిసారించాయి.
ఇదే సమయంలో హైదరాబాద్‌లోనే మరో యువతి తాను హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి పెట్టడం సంచలనం రేపింది.
నారాయణగూడలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి.
తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా లేఖ రాయాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది.ఓ అబ్బాయితో కలిసి గుంటూరులో ఉన్న సమయంలో ఆమె జాడ తెలుసుకున్న పోలీసులు.
హైదరాబాద్ తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు.

నిజామాబాద్‌కే చెందిన మరో యువకుడితో గతంలో ప్రేమలో ఉన్న ఈ యువతి.తర్వాత అతనికి గుడ్‌బై చెప్పి హైదరాబాద్ వచ్చింది.అయితే అతడు కూడా ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి మళ్లీ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
తన రూమ్‌కు రావాలని, పెళ్లి చేసుకోవాలని.లేదంటే గతంలో ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను వైరల్ చేస్తానని ఆమెను బెదిరించాడు.
దీంతో వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె లేఖ రాసింది.హుస్సేన్‌సాగర్‌లో దూకడానికి వెళ్లిన సమయంలో అక్కడున్న వాకర్స్ ఆమెను అడ్డుకున్నారు.అయితే ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ అబ్బాయి రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది.అదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.
రూమ్‌లో ఉన్న ఏదో రసాయనం తాగడంతోపాటు బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడని, దీంతో చేసేది లేక అతనితో కలిసి గుంటూరు వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది.అక్కడ పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు వెళ్లడంతో ఆ యువకుడి బారి నుంచి ఆమె బయటపడగలిగింది.