ఒక్కరోజులో బెంగళూరు ఆసుపత్రి ఘనత.. ఏకంగా గిన్నిస్ బుక్‌లో చోటు..

ఆసుపత్రులు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి.నిత్యం ఏదో ఒక అనారోగ్యంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్తుంటారు.

ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నప్పుడు ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు.అయితే ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చేసేందుకు కొన్ని పరీక్షలను చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

తద్వారా ఆ రోగికి గల అనారోగ్యాన్ని వారు అంచనా వేసి చికిత్స అందిస్తారు.ఇదే కోవలో బెంగళూరు నారాయణ హెల్త్ సిటీ( Bangalore Narayana Health City ) అరుదైన ఘనతను సాధించింది.

కేవలం ఒక్క రోజులోనే అత్యధిక ఎలక్ట్రో కార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు (ఈసీజీ)( Electrocardiogram Screenings ) నిర్వహించింది.ఇలా చేసి ప్రపంచంలో మరే ఇతర హాస్పిటల్‌కు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది.

Advertisement

అంతేకాకుండా ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో( Guinness Book of Records ) చోటు దక్కించుకుంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన నారాయణ హెల్త్ సిటీ బాగా పేరొందింది.ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులకు ఇక్కడ ప్రత్యేక చికిత్స అందుతుంది.

సెలబ్రెటీలు సైతం ఇక్కడికే వస్తుంటారు.

తాజాగా ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 3,797 ఎలక్ట్రో కార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు (ఈసీజీ) నిర్వహించారు.ఈ రికార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ వారు గుర్తించారు.ఆసుపత్రికి వచ్చి గిన్నిస్ రికార్డు అందజేశారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

ఒక రోజులో ఏ ఆసుపత్రిలోనైనా అత్యధిక ఈసీజీలు( ECG ) చేయడం ఇదే తొలిసారి.గురువారం ఆసుపత్రి ఈ ఘనత సాధించింది.శుక్రవారం నారాయణ హెల్త్ సర్టిఫికేషన్ పొందింది.24 గంటల్లో అత్యధిక ఎలక్ట్రో కార్డియోగ్రామ్ స్క్రీనింగ్‌లు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు నారాయణ హెల్త్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

"ఈ విశేషమైన ఫీట్ నారాయణ హెల్త్ ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించిపెట్టింది, ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందాలనే దాని నిబద్ధతను పటిష్టం చేసింది.ఈ రోజు నారాయణ హెల్త్ సర్టిఫికేషన్ పొందింది" అని సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ: "హెల్త్ స్క్రీనింగ్ గురించి అవగాహన కల్పించడం, గుండె జబ్బుల నివారణకు రెగ్యులర్ చెకప్‌ల ప్రాముఖ్యత గురించి మాత్రమే మా ప్రయత్నం జరిగింది" అని వివరించారు.

తాజా వార్తలు