రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో చెప్పడం కష్టం .ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపు గుర్రాల కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే గెలుస్తారనే నాయకులకు అధికార పార్టీ టీడీపీ టికెట్లను ఖరారు చేసింది.దాదాపు సిట్టింగుల్లో చాలా మందికి టికెట్లు ఖరారు చేసే దిశగానే అడుగులు వేస్తోంది.అదేసమ యంలో మంత్రి నారా లోకేష్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.2017లో ఆయన ఎమ్మెల్సీ అయి ఆ వెంటనే మంత్రి వర్గంలో సీటు సంపాయించుకున్నారు.అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

లోకేష్ దొడ్డిదారిలో మంత్రి అయ్యారని విపక్ష నాయకులు ముఖ్యంగా చంద్రబాబుకు ఫ్రెండ్ అయిన పవన్ కూడా విరుచు కుపడ్డారు.దీంతో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ పోటీకి దిగి.ఎన్నికల్లో గెలిచి.
విజయం సాధించి అసెంబ్లీకి వెళ్లాల ని నిర్ణయించారు.ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల విషయంపై చర్చలు సాగుతున్నాయి.
ముందు అనంతపురం జి ల్లా హిందూపురం టికెట్ ఇవ్వాలని చూశారు.అయితే, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య తిష్ట వేయడంతో ఆయనను క దిలించే ప్రయత్నం చేసేలా లేదు.
ఇక, కుప్పం నియోజకవర్గాన్ని అనుకున్నా.మళ్లీ ఇక్కడ కూడా ఆయన పేరు పక్కన పెట్టి.
గుంటూరులోని ఏదైనా కీలక నియోజకవర్గం ఇవ్వాలనుకున్నారు.

అయితే, ఇప్పుడు ఏకంగా బెజవాడలోని తూర్పు నియోజకవర్గం అయితే బాగుంటుందనే ప్రచారం తెరమీదికి వచ్చింది.ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు టికెట్ కన్ఫర్మ్ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు అనుకున్నారు.అయి తే, కొన్ని వ్యక్తిగత కారణాలు , కొన్ని పార్టీలోనికారణాల వల్ల ఆయన ఇక్కడ నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు.
అయితే, అదేసమయంలో ఇక్కడ విజయవాడ మేయర్‌గా ఉన్న కోనేరు శ్రీధర్ టికెట్ ఆశిస్తున్నారు.అయితే, ఈయనకు టికెట్ ఇస్తే.పోయి పోయి ఇక్కడ వైసీపీని గెలిపించినట్టే అవుతుందని గుర్తించిన చంద్రబాబు.వ్యూహాత్మకంగా లోకేష్ పేరును ప్రతిపాదించాలని చూస్తున్నారు.
ఇక్కడక మ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, ఎన్టీఆర్ అభిమాన కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లోకేష్ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు పరిశీలకులు.