రంగంలోకి చినబాబు అమరావతి కోసం నిరాహారదీక్ష ?

ఏపీలో కార్చిచ్చులా అలుముకున్న అమరావతి మంటలపై చలి కాచుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధంగానే తమ రాజకీయాలు మొదలుపెట్టాయి.

ప్రభుత్వ నిర్ణయం అవివేకం, అన్యాయం అంటూ ఇప్పటికీ వైసిపి రాజకీయ ప్రత్యర్థులు గొంతెత్తి మరీ ప్రజలను మరింత రెచ్చగొడుతున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ కూడా అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించ వద్దు అంటూ గట్టిగా పోరాడుతోంది.ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరిని అమరావతి ఉద్యమంలోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించారు.

చంద్రబాబు పోరాటానికి మీడియాలో కూడా ఎక్కువ మద్దతు లభిస్తుండడంతో ఈ అంశం భాగా పాపులర్ అయింది.అయితే ఈ అమరావతి ఉద్యమంలోకి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

తెలుగుదేశం పార్టీకి బావి నాయకుడుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న లోకేష్ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.దీని కోసం గతంలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తరహాలో లోకేష్ దీక్ష చేయాలని భావిస్తున్నారట.ఈ విధంగా చేయడం వల్ల బాగా పాపులర్ అవడంతో పాటు తెలుగుదేశం పార్టీలో లోకేష్ నాయకత్వంపై మరింత ధీమా పెరుగుతుంది అనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

Advertisement

ఇప్పటి వరకు దొడ్డిదారిలో ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారు అనే అపవాదు మీద వేసుకున్న లోకేష్ ఇప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా సమర్ధుడైన నాయకుడుగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు.అయితే లోకేష్ దీక్షకు దిగితే ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా ఎందుకు ఉంటుంది.? వెంటనే తీసుకువెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేసి టీడీపీకి లోకేష్ కు మైలేజ్ రాకుండా చేస్తారనేది మరికొందరి వాదన.కానీ లోకేష్ మాత్రం ఆమరణ నిరాహార దీక్షకు దిగి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాడాలని చూస్తున్నారు.

ఒకవేళ తన దీక్ష ప్రభుత్వం భగ్నం చేసినా, చేయాలని చూసినా తనను చూసి జగన్ బయపడ్డారనే సంకేతాలు జనాల్లోకి వెళ్తుందని లోకేష్ ఆలోచనగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు