మణిరత్నం సినిమాను దించేస్తున్న టక్ జగదీష్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత మరోసారి ‘నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్ అందించిన శివనిర్వాణ దర్శకత్వంలో నాని సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాకు టక్ జగదీష్ అనే టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.అయితే ఈ సినిమా కథ సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అగ్ని నచ్చత్రం(తెలుగులో ఘర్షణ) అనే సినిమా కథను పోలీ ఉంటుందని చిత్ర వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రి ఆస్తికి తామే వారసులమంటూ వచ్చి ఎలా పోటీపడతారనేది కథగా మణిరత్నం మనకు గతంలోనే చూపించాడు.ఇక శివ నిర్వాణ ఈ కథకు కాస్త మార్పులుచేర్పులు చేసి తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథను మనకు చూపించేందుకు రెడీ అవుతున్నాడట.

Advertisement

మరి టక్ జగదీష్‌కు సోదరుడిగా ఎవరు నటిస్తారా అనే అంశంపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ క్లారిటీ వచ్చింది.ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు