టాలీవుడ్ భవిష్యత్తును చెప్పనున్న నాని

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 22 నుండి లాక్‌డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాల కార్యకలాపాలు రద్దయ్యాయి.

అటు సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా మూతపడ్డాయి.అయితే ఈ లాక్‌డౌన్ ఎప్పుడు లిఫ్ట్ అవుతుందా అని సినీ పెద్దలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ లాక్‌డౌన్ ముగిసిన తరువాత టాలీవుడ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయించేది ఖచ్చితంగా నేచురల్ స్టార్ నాని అని చెప్పాలి.నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను తొలుత మార్చి 31న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

Advertisement

కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేసినా కూడా థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తే ఆ ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు ‘వి’ చిత్రం తెలుపనుంది.అంటే టాలీవుడ్‌లో సినిమాలు రిలీజ్ అయితే వాటి ఫలితాలు ఏమిటనేది మాత్రం నాని ‘వి’ సినిమా రిజల్ట్ చెప్పనుంది.

మొత్తానికి వి సినిమా టాలీవుడ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు నాని చెప్పనున్నాడు.ఒకవేళ నాని వి సినిమా రిజల్ట్ తేడా కొడితే థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయడం శ్రేయస్కరం కాదని స్పష్టం అవుతుంది.

కానీ వి సినిమా సక్సెస్ కొడితే మాత్రం ఆ తరువాత తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయం ఖాయం.మరి లాక్‌డౌన్ తరువాత నాని ఎలాంటి రిజల్ట్‌ను రాబడతాడో చూడాలి.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు