టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచులర్ స్టార్ అని పేరు సంపాదించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ అందుకున్నాడు నాని.ఈయన సినిమా రాబోతుందంటే ఏదో కొత్తదనం ఆశిస్తారు ఆడియన్స్.
డిఫెరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నాని.ప్రస్తుతం నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.
నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ రాబోతుంది.
ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల అవుతున్న సందర్భంగా ఇప్పటి నుండే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసాయి.తాజాగా చిత్ర యూనిట్ పరిచయ వేదిక పేరుతో ఒక ఈవెంట్ చేసారు.ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యింది.ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.ఇంత మంది అభిమానులను చూసి చాలా రోజులయ్యింది.మిమ్మల్ని చాలా రోజులపాటు మిస్సయ్యాను.
ఈ ఈవెంట్ కు పరిచయ వేదిక అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది.అందుకే నా ఫ్యామిలీని మీకు పరిచయం చేయబోతున్నాను.సినిమాలోని ఫ్యామిలీ మెంబెర్స్ ను ఒక్కొక్కరిగా చూపిస్తే వారి గురించి వివరిస్తా అని అందరి గురించి వరసగా చెప్తూ వచ్చాడు.తర్వాత నేను ఫ్యాన్స్ ను పెద్దగా పట్టించుకోనని అనుకుంటారు.
అవును నిజంగానే నేను వాళ్ళని ప్రోత్సాహించను.అందరిలా ఫ్యాన్స్ అల్లరి చేయాలనీ.
ఫ్లెక్సీలు పెట్టి అభిషేకాలు చేయాలనీ నేను కోరుకోను.మీరు నన్ను చూసి గర్వపడేలా నడుచుకోవాలి ప్రతిరోజు కష్టపడుతూ ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అంటూ నాని ప్రసంగించారు.