ముంబైలో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న నాని.. 'దసరా' ప్రమోషన్స్ షురూ!

మన స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో చాలా మంది హీరోలు సక్సెస్ కూడా సాధించారు.

ఇక ఇప్పుడు టైర్ 2 హీరోల్లో ఒకరైన నాచురల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియన్ వ్యాప్తంగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఆ లెవల్లోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు.ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు దసరా సినిమాతో నాని రాబోతున్నాడు.

అందుకే నార్త్ లో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ అన్ని భాషల్లో రాగా ఈ సినిమా హిందీ మార్కెట్ వసూళ్లుపై ఆసక్తి పెరిగింది.

Advertisement

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాని ముంబైలో అడుగు పెట్టాడు.

అక్కడ నానికి గ్రాండ్ వెల్కమ్ దక్కింది.ఆడియెన్స్ నుండి సాలిడ్ వెల్కమ్ దక్కడంతో ఆ వీడియోను నాని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు.అక్కడ హొలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న నాని యూత్ లో తనకు దక్కిన వెల్కమ్ కు ఫుల్ ఖుషీ అవుతున్నాడు.

మరి హిందీ ఆడియెన్స్ నుండి కూడా దసరాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు