తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితా అరెస్ట్ కాబోతున్నారా ? డిల్లీ లిక్కర్ స్కామ్ ఆమెను వీడేలా కనిపించడం లేదా ? కవితా అరెస్ట్ అయితే కేసిఆర్ కు తిప్పలు తప్పవా ? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.ఇటీవల దేశ వ్యాప్తంగా డిల్లీ లిక్కర్ స్కామ్ ఎంతటి సంచలనం సృష్టించిదో అందరికీ తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే చాలమంది దొషులుగా నిరూపితం అవుతున్నారు.గత ఏడాది సెప్టెంబర్ లో ఈ లిక్కర్ స్కామ్ బయటకు రాగా.
అదే ఏడాది సెప్టెంబర్ 27న దాదాపుగా 11 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది.వారందరితో పలుమార్లు విచారణ చేపట్టి దొషులుగా తేల్చింది ఈడీ.ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిలో విజయ్ నాయర్, సమీర్ మహేందు, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి,
వినయ్ బాబు, రాఘవరెడ్డి, ప్రేమ్ రాహుల్, గౌతమ్ మల్హోత్రా, రామచంద్ర పిల్లై, మనిష్ సిసోడియా వంటి వాళ్ళు ఉన్నారు.ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితా కూడా చేరబోతున్నారా ? అనే ప్రశ్న సంచలనంగా మారింది.ఇంతకు ముందే ఈడీ విచారణను ఎదుర్కొన్నా కవితకు.మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన రామచంద్ర పిల్లై ఇచ్చిన వివరాల మేరకు.కవితా కు రామచంద్ర పిల్లై బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే ముడుపుల పంపిణీ జరిగిందని పైల్లై ఈడీకి తెలిపినట్లు సమాచారం.
దీంతో ఈ నెల 9 న మరోసారి విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

అయితే తను విచారణకు సహకరిస్తానని, తెలంగాణ తలవంచడని ఆమె ట్విట్టర్ లో స్పందించారు.అయితే 10న బిఆర్‌ఎస్ ధర్నా చేపడుతుండగా 9న కవితా ఈడీ విచారణను ఎదుర్కోవడం ఆసక్తికర అంశమే.కాగా లిక్కర్ స్కామ్ లో కవితా నిందితురాలని, ఆమెకు అరెస్ట్ తప్పదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
తాజా పరిణామాలు చూస్తుంటే కవితా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే తెలుస్తోంది.ఒకవేళ లిక్కర్ స్కామ్ లో కవితా అరెస్ట్ అయితే.
బిఆర్‌ఎస్ కు గట్టి షాకే అని చెప్పక తప్పదు ఎందుకంటే.ప్రస్తుతం బిఆర్‌ఎస్ ను జాతీయ స్థాయిలో విస్తరించే పనిలో ఉన్నారు కేసిఆర్.
ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం కేసిఆర్ ను కొంత ఇబ్బంది పెట్టె పరిణామమే.

ఇటు ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల సమయంలో కూడా కవితా అరెస్ట్ బిఆర్‌ఎస్ పై కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.అయితే ఇదంతా కూడా బీజేపీ ప్రభుత్వం చేస్త్యున్న కుట్ర అని, కేసిఆర్ ను జాతీయ రాజకీయాల్లో అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే మోడి సర్కార్ ఈ లిక్కర్ స్కామ్ ను అంటగట్టే ప్రయత్నం చేస్తోందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.మొత్తానికి ఇప్పుడు డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు రెండవ సారి నోటీసులు జారీ కావడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
మరి ఏం జరుగుతుందో చూడాలి.