బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని ఆరోపించారు.
ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు బీజేపీకి అలవాటేనని వీహెచ్ విమర్శించారు.
గతంలో సోనియా, రాహుల్, శివ కుమార్ నూ వేధించారని తెలిపారు.అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే నాటకాలు ఆడుతున్నారని వెల్లడించారు.