నాని 'దసరా' కి డిజాస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్..మరీ ఇంత దారుణమా!

ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి న్యాచురల్ స్టార్ నాని ( Nani ) హీరో గా నటించిన దసరా చిత్రం.

( Dasara Movie ) విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఈ చిత్రానికి దర్సకత్వం వహించాడు.తొలి సినిమా అయ్యినప్పటికీ కూడా అతను తీసిన కొన్ని షాట్స్ ఇప్పటి వరకు రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా తియ్యలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు చూస్తే మనకి తెలియకండానే సీట్స్ లో షాక్ కి గురై ఉలిక్కిపడుతాము.అంత అద్భుతంగా తీసాడు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి దాదాపుగా 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Advertisement

ఇకపోతే రీసెంట్ గానే ఈ సినిమా జెమినీ టీవీ లో గ్రాండ్ గా టెలికాస్ట్ అయ్యింది.టీఆర్ఫీ రేటింగ్స్( TRP Ratings ) అదిరిపోతాయని అందరూ ఆశించారు.కానీ ఊహించిన అంచనాలను కనీస స్థాయికి కూడా రీచ్ అవ్వలేకపోయింది ఈ సినిమా.బార్క్ సంస్థ విడుదల చేసిన టీఆర్ఫీ రేటింగ్స్ పట్టిక లో దసరా చిత్రానికి కేవలం 4.5 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.ఈ సినిమా కంటెంట్ కి వచ్చిన రేటింగ్స్ కి అసలు సంబంధమే లేదు.

గతం లో కూడా ఇంతే, నాని హీరో గా నటించిన అంటే సుందరానికి( Ante Sundaraniki ) చిత్రానికి కేవలం ఒకే ఒక్క టీఆర్ఫీ రేటింగ్ వచ్చింది.శ్యామ్ సింగ రాయ్( Shyam Singa Roy ) చిత్రానికి కూడా గొప్ప టీఆర్ఫీ రేటింగ్స్ ఏమి రాలేదు.

ఇదంతా చూస్తుంటే నాని సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం ఆపేశారా అని అనిపిస్తుంది.ఒకవేళ అదే నిజం అయితే నాని కి అర్జెంటుగా ఒక పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా కావాలి.

అయితే దసరా చిత్రానికి తక్కువ రేటింగ్స్ రావడానికి కారణం అది ఊర మాస్ సినిమా అవ్వడం, దానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో పెద్దగా ఆదరణ లేకపోవడం అని కొంతమంది అంటున్నారు.దసరా చిత్రం థియేటర్స్ లో ఉన్నప్పుడు కూడా కేవలం మాస్ ఆడియన్స్ సినిమాని నచ్చారు కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమి సినిమా రా బాబు ఇది అని కామెంట్ చేసారు.అదే టీవీ టెలికాస్ట్ మీద కూడా ప్రభావం చూపించిందని అభిప్రాయపడుతున్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

రాబోయే సినిమాలతో అయినా నాని తన సత్తా టెలివిజన్ మీద కూడా చాటి చెప్తాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు