టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన నాని

‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో ఘన విజయం సాధించి సక్సెస్‌ జోష్‌లో ఉన్న యువ హీరో నాని తన తర్వాత సినిమాను ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

మహేష్‌బాబుతో వరుసగా మూడు సినిమాలను నిర్మించిన 14 రీల్స్‌ సంస్థ నానితో ఈ సినిమాను నిర్మిస్తుంది.

ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం అయిన ఈ సినిమాలో నాని బాలకృష్ణకు వీరాభిమానిగా నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.బాలకృష్ణ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా నాని ఈ సినిమాలో కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.దాంతో నాని ‘జై బాయ్య’ అంటున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై నాని స్పందించాడు.తాను ఈ చిత్రంలో బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న మాట వాస్తవమే కాని, సినిమాకు టైటిల్‌ను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

Advertisement

‘జై బాలయ్య’ టైటిల్‌ను పెట్టినట్లుగా ప్రచారం జరుగుతున్నదాంట్లో నిజం లేదని, అవన్ని పుకార్లు మాత్రమే అని కొట్టి పారేశాడు.దాంతో నాని సినిమా టైటిల్‌పై క్లారిటీ వచ్చింది.

త్వరలో ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

Advertisement

తాజా వార్తలు