నిన్నటి ఎపిసోడ్ లో నాని చెప్పిన పిట్ట కథ వెనక ఇంత స్టోరీ ఉందా.? ఎవర్ని ఉద్దేశించి అన్నారంటే.?     2018-06-30   23:19:25  IST  Raghu V

ఇంకొంచెం మసాలా అంటూ మొదలయిన బిగ్ బాస్ రెండో సీజన్ ప్రస్తుతం మూడో వారం పూర్తి చేసుకుంది. హోస్ట్ నాని మసాలాను పెంచే ప్రయత్నం బాగానే చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే పూరి జగన్నాధ్ గారి స్టైల్ లో పిట్ట కథలు కూడా చెప్పేస్తున్నారు. దాంట్లో నీతి కూడా చాలా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే..!

శనివారం నాటి ఎపిసోడ్‌లో మరోసారి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాని.. తనదైన శైలిలో హౌస్‌మేట్స్‌కు చురకలంటించారు. బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యులను ఉద్దేశించి.. ఎప్పటిలాగే నాని ఈ రోజు ఓ పిట్ట కథ చెప్పారు. అదేంటో ఓ లుక్ వేసుకుందాం.!”అనగనగా ఓ రాజుగారు ఉంటారు. ఆ రాజుకు ఓ చిలుకంటే చాలా ఇష్టం. దాన్ని ఎప్పుడూ ప్రాణంగా చూసుకునేవాడు. ఓ రోజు ఆ చిలుక రాజుకు ఓ పండు ఇస్తుంది. దాన్ని తింటే నిత్య యవ్వనం వస్తుందని చిలుక చెబుతుంది. అయితే, ఆ రాజు అది చెప్పింది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు దాన్ని ఓ సైనికుడికి ఇచ్చి తినమన్నాడు. అది తిన్న సైనికుడు చనిపోతాడు.