నందమూరి హీరోలలో మంచితనం మరింత ఎక్కువగా ఉండే హీరోగా కళ్యాణ్ రామ్ కు పేరుంది.సాఫ్ట్ రోల్స్ లో ఎక్కువగా నటించిన కళ్యాణ్ రామ్ కొన్నిసార్లు సక్సెస్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సందర్భాల్లో ఫ్లాపులు ఎదురయ్యాయి.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త డైరెక్టర్లను నమ్మి ఛాన్స్ ఇచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.కొన్నిసార్లు కొత్త డైరెక్టర్లు కళ్యాణ్ రామ్ కు సక్సెస్ ఇచ్చారు.
కళ్యాణ్ రామ్ సినిమాలతో దర్శకులుగా కెరీర్ ను మొదలుపెట్టిన సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిందే.నందమూరి హీరోల సినిమాలతో దర్శకులుగా కెరిర్ ను మొదలుపెట్టిన డైరెక్టర్లకు లక్ కలిసొచ్చింది.
అయితే కొత్త డైరెక్టర్లు చెప్పిన కథ నచ్చితే ఆ సినిమాలకు చాలా సందర్భాల్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు.తన సినిమాలతో నిర్మాతలు నష్టపోకూడదని కళ్యాణ్ రామ్ భావించేవారు.
నందమూరి కళ్యాణ్ రామ్ కు ఉన్న ఈ గొప్ప లక్షణం గురించి తెలిసి నందమూరి ఫ్యాన్స్ సైతం గర్వంగా ఫీలవుతున్నారు.కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.బింబిసార భారీ సక్సెస్ తో కళ్యాణ్ రామ్ సినిమాలను ఎక్కువ బడ్జెట్ తో నిర్మించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బింబిసార2 సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బింబిసార2 కూడా కళ్యాణ్ రామ్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.