భారీ సెట్ లో ‘NBK108’ సాంగ్ షూట్.. ఆ ఒక్క పాట కోసమే రూ.5 కోట్ల ఖర్చు!

నందమూరి నటసింహం బాలయ్య ( Nandamuri Balakrishna ) హ్యాట్రిక్ హిట్ కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ సినిమాల తర్వాత బాలయ్య మరింత జోష్ గా మారిపోయాడు.

తన యంగ్ఏజ్ కంటే కూడా ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ ఆకట్టు కుంటున్నాడు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ NBK108.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం కంటే ఎక్కువ పూర్తి కాగా మిగతా భాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

మరి షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.

Advertisement

ఈ సినిమాలో ఒక సాంగ్ ఉందని ఏకంగా ఆ సాంగ్ కోసం 5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది అని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సాంగ్ కోసం 5 కోట్లతో భారీ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేసి బాలయ్య, శ్రీలీల ( Sreeleela ) మీద సాంగ్ షూట్ ను గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సాంగ్ గణేశుడిపై సాగుతుందట.

మరి కేవలం ఒక్క సాంగ్ కోసమే 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని తెలిసి ఈ సాంగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అవ్వనుంది.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు