అందరికి ఆధారం ఆమె ఒక్కతే.. నమ్రతను చూసి అందరు నేర్చుకోవాల్సిన విషయాలు

నమ్రత.మహేష్ బాబుకు భార్యగా, ఘట్టమనేని ఇంటి కోడలుగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తుంది.

మన తెలుగు హీరోయిన్స్ లేదంటే మన తెలుగు హీరోల భార్యలు నమ్రతను చూసి అనేక విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.నమ్రత కేవలం మహేష్ బాబు భార్య గానే కాకుండా ఘట్టమనేని ఇంటికి కోడలుగా ఎన్నో బాధ్యతలను తన భుజాలపై మోస్తూ ఉంటుంది.

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన ఈ సందర్భంగా నమ్రత కుటుంబాన్నంత ఓదారిస్తున్న తీరు అలాగే తన మామ అయిన కృష్ణని చూసుకుంటున్న విధానం చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఎక్కడో ముంబైలో పుట్టి మన తెలుగు ఇంటికి కోడలుగా వచ్చిన నమ్రత ఎంతో ఒదిగిపోయి ఉండటాన్ని మహేష్ బాబు అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు.

వాస్తవానికి నమ్రత ఘట్టమనేని కుటుంబానికి వెన్నుముక లాంటిది.కృష్ణ, ఇందిరను కాదని విజయనిర్మల పెళ్లి చేసుకున్నా కూడా కృష్ణ కుటుంబంతో నమ్రత ఎప్పుడు మంచి సంబంధాలను కలిగి ఉంది.తన అత్తకు సవతిగా వచ్చిన విజయనిర్మలతో స్నేహ పూర్వకంగానే ఉంది.

Advertisement

విజయ నిర్మల చనిపోయిన రోజు కూడా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంది.అలాగే కృష్ణ పెద్దకొడుకు రమేష్ బాబు మరణించిన సందర్భంలో మహేష్ బాబుకి కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్నప్పటికీ అన్నీ తానే చూసుకుని అంత్యక్రియను పూర్తి చేయించింది.

ఇక తన పిల్లల విషయంలోనూ చక్కటి తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తుంది.తన కొడుకుని అలాగే కూతురిని అన్ని విషయాల్లోనూ ఆమె గైడ్ చేసే విధానం ఎంతోమందికి ఆదర్శం.

అలాగే అత్త ఆయన ఇందిరా దేవిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది.తన భర్తకి బిజినెస్ లో కూడా సహాయం చేస్తుంది.అలాగే తన భర్త మేకోవర్, స్టైల్ అన్ని ఈరోజు ఇలా ఉన్నాయంటే కారణం ఖచ్చితంగా నమ్రతే అని చెప్పి తీరాలి.

అలా భర్త సక్సెస్ లో వెనకే ఉంటుంది నమ్రత.అలాగే బిజినెస్ కూడా అన్ని తానే చూసుకుంటుంది.మహేష్ బాబు సోదరీమణులతో మంచి స్నేహంగా ఉంటూ కుటుంబాన్ని ప్రతి ఆదివారం డిన్నర్ కి ఆహ్వానిస్తుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఆలా నమ్రత ఒక తల్లిగా, భార్యగా, కోడలిగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం.

Advertisement

తాజా వార్తలు