Namrata Shirodkar : నేను మహేష్ బాబు తో నటించడం కుదరదు : నమ్రత శిరోద్కర్

మహేష్ బాబు అంటే పడిచచ్చిపోయే వారు తెలుగు అభిమానులు కోట్లల్లో ఉన్నారు.

అయన చేసే సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేయడం కూడా చాల మంది ఇష్టపడతారు.

సినిమాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఇవ్వడం మహేష్ బాబు కి సాధ్యం అయినట్టు మరో హీరోకు సాధ్యం కాదు.ఈ విషయాన్నీ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ని నేరుగా అడిగేసారు కూడా.

మీలో ఎవరు కోటీశ్వరుడు( Meelo Evaru Koteeswarudu ) షో కి గెస్ట్ గా వచ్చినప్పుడు మహేష్ బాబు ని ఈ ప్రశ్న ఎన్టీఆర్ అడగగా అయన ఎదో దాటవేసే ప్రయత్నం చేసారు.కానీ మహేష్ బాబు విజయం లో కీలక బాధ్యత ఎప్పుడు అయన భార్య నమ్రత( Namrata Shirodkar ) కి దక్కాలి.

అయన లైఫ్ ని, సినిమాని నమ్రత చాల చక్కగా ప్లాన్ చేస్తూ ఉంటారు.అందుకే సినిమా తర్వాత మరొక ప్రపంచం కేవలం కుటుంబం మాత్రమే అంటూ ఉంటారు మహేష్ బాబు.ఇక నమ్రత ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె వ్యక్తి గత జీవితంలోని అనేక విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

మహేష్ బాబు తో ఒకే ఒక్క సినిమా నడిచి అతడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు నమ్రత.అయితే ఆమెకు మరోమారు మహేష్ బాబు ( Mahesh babu )నటించే అవకాశం వస్తే నటిస్తారా అంటూ యాంకర్ ప్రశ్నించగా, అందుకే ఆమె నిక్కచ్చిగా లేదు అనే సమాధానం చెప్పారు.మహేష్ బాబు తో ఎంత గొప్ప అవకాశం వచ్చిన తాను ఇకపై నటించేది లేదు అంటూ కుండా బద్దలు కొట్టేసారు.

అంతటితో ఆగని యాంకర్ అది ఎంతో ముఖ్యమైన పాత్రా అయినా కూడా లేదు అనే సమాధానం చెప్తారా అని అడగగా అందుకే ఆమె అవును నేను ఇకపై నటించను, అది ఎవరి సినిమా అయినా సరే, చివరికి మహేష్ సినిమా అయినా కూడా నటించను అంటూ చెప్పారు.తన ప్రాధాన్యత ఇప్పుడు కేవలం మహేష్ తో పాటు కుటుంబాన్ని, పిల్లలను చూసుకోవడం ఆ తర్వాత తాను ఎంచుకున్న కొన్ని వ్యాపారాలను చక్కగా చేసుకోవా అంటూ చెప్పారు.దీంతో నమ్రత కు నటన పై ఎలాంటి ఆసక్తి లేదు అని, బలవంతంగా నటించాల్సిన అవసరం కూడా లేదంటే మహేష్ బాబు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు