టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ బాబు స్టార్ హీరోగా నిలిచాడు.
ఇక ఈయన భార్య నమ్రత గురించి అందరికీ పరిచయమే.ఈమె కూడా ఇండస్ట్రీకి చెందిన నటి.తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.మహేష్ బాబు నమ్రత కలిసి ఓ సినిమాలో కూడా నటించగా ఆ సమయంలో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఇక 2005లో పెళ్లి చేసుకోగా వీరికి గౌతమ్ కృష్ణ, సితార అనే పిల్లలు ఉన్నారు.ఇక నమ్రత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.నమ్రత తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తుంది.
అంతేకాకుండా వారి ఇష్టాయిష్టాలను కూడా బాగా గౌరవిస్తుంది.
ఈమె గతంలో తన పిల్లల గురించి చాలాసార్లు చెప్పుకొచ్చింది.
ఏది మంచి ఏది చెడు అనే వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉంటుందట.పిల్లలని వీలైనంత నిరాడంబరంగా ఉండమని.
ఇక తమ పిల్లలు అదేపనిగా చదవడం కూడా ఇష్టపడరని తెలిపింది.అందుకే వారికి చదివించే విషయంలో మాత్రం బాగా స్ట్రిక్ట్ గా ఉంటానని గతంలో తెలిపింది.
ఇక వారి జీవితంలో ఆటలు కూడా ఒక భాగమని కూతురు సితార కు డాన్స్ అంటే ఇష్టం అని తెలిపింది.తన కొడుకు గౌతమ్ కు సిమ్మింగ్ చేయడం ఇష్టమట.

ఇక పిల్లల విషయంలో ఎప్పుడు చాలెంజింగ్ గా అనిపించలేదని పిల్లలు ఉంటే సరదాగా ఉంటుందని తెలిపింది.నమ్రత ఒక తల్లి గానే కాకుండా మంచి భార్యగా కూడా దొరికిందని మహేష్ బాబు పలుమార్లు తెలిపాడు.తను ఒక స్టార్ నటుడిగా, వ్యాపారంలో అగ్ర స్థాయి లో ఎదిగేలా చేయడంలో నమ్రత బాధ్యత ఉందని గతంలో తెలిపాడు మహేష్.కేవలం భార్య గానే కాకుండా మంచి స్నేహితురాలిగా ఉంటుందని ఆమె తన ప్రపంచమని తెలిపాడు.
గతంలో నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కుటుంబం గురించి, తన గురించి చాలా విషయాలు పంచుకుంది.మహిళలందరూ స్ట్రాంగ్ గా, ఫిట్ గా ఉండాలని అంతే కాకుండా అన్ని రంగాల్లో కూడా మంచి విజయాలను అందుకోవాలని తెలిపింది.
తను ఇప్పటికీ ఒకే రకమైన ఫిజిక్ ను మెయింటెన్ చేస్తుందట.ఎప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి ప్రయత్నిస్తానని తెలిపింది.

మంచి ఆహారంతో తీసుకోవడానికి కూడా బాగా ఆసక్తి చూపుతానని తెలిపింది.తన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చాలా పద్ధతిగా ఉంటాయని ఎక్కువగా ఆంధ్ర ఫుడ్ ఇష్టపడతాను అని తెలిపింది. కాని తనకు మాత్రం వంట చేయడం అస్సలు రాదని షాక్ ఇచ్చింది.హెల్దీ ఫుడ్ వండడానికి తమ ఇంట్లో మంచి చెఫ్ ను పెట్టుకున్నామని తెలిపింది.
ఇక గతంలో కొందరు నెటిజన్లలో ఆమెకు వంట రాకపోవడంతో ఉత్తమ ఇల్లాలు ఎలా అయిందో అని కామెంట్లు కూడా చేశారు.ఇక సితార విషయంలో తన తల్లి లాగానే తను కూడా సితారను ట్రెడిషనల్ గా తయారు చేయడానికి ఇష్టపడతానని తెలిపింది.